Abn logo
Oct 15 2021 @ 01:30AM

మహాగౌరిగా భ్రామరి

శ్రీశైలం అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌: వెలంపల్లి 

కర్నూలు(అర్బన్‌), అక్టోబరు 14: దసరా నవరాత్రి ఉత్సరాల్లో భాగంగా గురువారం శ్రీశైలంలో భ్రమరాంబదేవి మహాగౌరిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ను నందివాహనంపై ఊరేగించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీశైలం ఆలయం అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేశామని పేర్కొన్నారు.