Abn logo
Oct 18 2020 @ 15:34PM

ఆకట్టుకుంటున్న 'బుర్జ్‌ ఖలీఫా' వీడియో సాంగ్‌

Kaakateeya

బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ హీరోగా దక్షిణాది డైరెక్టర్‌ రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'లక్ష్మీబాంబ్‌'. తెలుగు, తమిళంలో 'కాంచన' పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేశారు. ఈ సినిమా నవంబర్‌ 9న ఓటీటీలో విడుదల కానుంది. రీసెంట్‌గానే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం 'లక్ష్మీ బాంబ్' యూనిట్‌ 'బుర్జ్‌ ఖలీఫా...' అనే వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. దుబాయ్‌లో బుర్జ్‌ ఖలీఫాకు ఎంతో గొప్ప పేరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి కట్టడం పేరుతో సాంగ్‌ను రూపొందించారు. పాటలో అక్షయ్‌ పెర్ఫామెన్స్‌కు కియారా అద్వానీ అందచందాలు ఎసెట్‌గా నిలుస్తున్నాయి. శశి కంపోజ్‌ చేసిన ఈ పాటను డీజే ఖుషి, నిఖితా గాంధీ పాడారు. Advertisement
Advertisement
Advertisement