Advertisement
Advertisement
Abn logo
Advertisement

సిరివెన్నెలతో కలిసి ఎన్నో సినిమాలకు పని చేశాం: ABNతో భువనచంద్ర

హైదరాబాద్: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి బాధాకరమని గేయ రచయిత భువనచంద్ర అన్నారు. ఫిల్మ్ ఛాంబర్‌లో సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ సీతారామశాస్త్రితో కలిసి ఎన్నో సినిమాలకు పని చేశామన్నారు. ఇద్దరం పోటీ పడి పాటలు రాసేవాళ్లమన్నారు. పాటలు రాయడం సిరివెన్నెల వృత్తి కాదని.. అది వ్యక్తిత్వమని అన్నారు. సిరివెన్నెల తనకు మంచి స్నేహితుడని భువనచంద్ర వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement