ప్రభుత్వ ఆస్పత్రిలో గంజాయి మొక్కలు

ABN , First Publish Date - 2021-08-17T20:33:01+05:30 IST

భువనగిరి: ప్రభుత్వ ఆస్పత్రి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది.

ప్రభుత్వ ఆస్పత్రిలో గంజాయి మొక్కలు

భువనగిరి: ప్రభుత్వ ఆస్పత్రి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో యదేచ్ఛగా గంజాయి మొక్కలు మొలిచాయి. ఇప్పుడు అది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్లు  గంజాయి సేవించేవారని, ఆ కారణంగానే గంజాయి మొక్కలు మొలిచి ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు. అనేక సార్లు గంజాయి మత్తులో ఇక్కడ గొడవలు కూడా జరిగేవని అంటున్నారు. అయినా ఆస్పత్రి సిబ్బంది చూసీ చూడనట్లు ఉండేవారని, పోలీస్ నిఘా కూడా సరిగా లేక ఈ ప్రాంతం గంజాయికి అడ్డాగా మారినట్లు సమాచారం.


నిత్యం పర్యవేక్షణ చేయాల్సిన సూపరింటెండెంట్ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. శానిటేషన్ సిబ్బంది ఉన్నా సరిగా శుభ్రం చేయడంలేదని స్థానికులు చెబుతున్నారు. నిత్యం వందలాదిమంది రోగులు చికిత్స కోసం ఆస్పత్రికి వస్తుంటారు. అలాంటి ఆస్పత్రి ఆవరణలో గంజాయి మొక్కులు మొలిచినా.. శానిటేషన్ సిబ్బంది, సూపరింటెండెంట్ ఎందుకు మౌనంగా ఉన్నారనే అనుమానాలు తలెత్తున్నాయి.

Updated Date - 2021-08-17T20:33:01+05:30 IST