Advertisement
Advertisement
Abn logo
Advertisement

సరిగ్గా 10 నెలల క్రితం పెళ్లి.. మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటూ యువతి అత్తారింటి నుంచి ఫోన్.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: అమ్మాయికి చక్కని సంబంధం కుదిరిందనుకున్నారు. అల్లుడు అడిగిన కట్నకానుకలన్నీ ఇచ్చారు. ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. అమ్మాయి సంతోషంగా కాపురం చేసుకుంటుందని అనుకున్నారు.  కానీ..పెళ్లైన రెండు నెలలకే ఆమెకు అత్తింటి వేధింపులు ప్రారంభమయ్యాయి. ఓ రోజు ఆమె గాబరాగా పుట్టింటికి ఫోన్ చేసింది. నన్ను రక్షించండి తాతాయ్యా..అంటూ కన్నీటి పర్యంతమైంది. వారు మాట్లాడుతుండగానే  లైన్ డిస్కనెక్ట్ అయింది.. అసలేం జరిగిందో తెలుసుకుందామని అమ్మాయికి ఫోన్ చేస్తే  షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది. మీ అమ్మాయి అత్మహత్య చేసుకుందంటూ.. అత్తింటి వారు దారుణమైన వార్తను చెప్పారు! రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ నగరంలో మంగళవారం నాడు జరిగిన ఈ ఘటన స్థానికంగా పెను కలకలాన్ని సృష్టిస్తోంది.

ప్రియాంకా సింగ్ అనే యువతికి నవంబర్ 2020లో వీరేంద్ర రావత్ అనే యువకుడితో వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా అల్లుడు కోరినవన్నీ అమ్మాయి కుటుంబసభ్యులు కట్నం కింద ఇచ్చుకున్నారు. కానీ.. రెండు నెలల తరువాత.. అతడు గొంతెమ్మ కోరికల చిట్టా విప్పదీశాడు. కారు కావాలంటూ  భార్యను వేధించడం మొదలెట్టాడు. అప్పుడప్పుడూ ఆమెపై చేయి కూడా చేసుకునేవాడు.  

ఈ విషయాలన్నీ ప్రియాంక ఎప్పటికప్పుడు తమ కుటుంసభ్యులకు చెబుతూనే ఉంది. వారు కూడా వీరేంద్ర పలుమార్లు నచ్చ చెప్పి.. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలని అభ్యర్థించేవారు. కానీ..ఇటీవల కాలంలో అతడి ఆగడాలు ఎక్కువయ్యాయని ప్రియాంక తన తల్లిదండ్రుల వద్ద మొరపెట్టుకుంది. తనకు మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ భర్త తనతో అన్న విషయాన్ని వారికి చెప్పుకుని బావురుమంది. వారి బంధం నిలబడాలంటే తక్షణం కారు కొనివ్వాలంటూ భర్త అల్టిమేటం ఇచ్చిన విషయాన్ని కూడా పేర్కొంది. 

ఇవీ చదవండి
పదో తరగతి అమ్మాయితో ఇంటర్ కుర్రాడి ప్రేమ.. మమ్మల్నిద్దరినీ ఒకే చితిపై కాల్చండి అంటూ లేఖ రాసి మరీ..
ఇద్దరు పిల్లల తల్లి అయిన మేనత్తతో 18 ఏళ్ల కుర్రాడి ప్రేమాయణం.. చివరకు వీళ్ల కథ ఎన్ని మలుపులు తిరిగిందంటే..


ఈ క్రమంలో మంగళవారం నాడు ఆమె తన పుట్టింటి వారికి ఫోన్ చేసి తనను రక్షించమని కోరడం ..ఆ తరువాత.. ఫోన్ అకస్మాత్తుగా కట్ చేయడం వంటి ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసలు అమ్మాయికి ఏం జరిగిందని ఆమె కుటుంసభ్యులు అత్తారింటికి మరోమారు ఫోన్ చేయగా.. అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటూ వారు పిడుగులాంటి వార్త చెప్పారు. అక్కడికి వెళ్లిచూస్తే...ప్రియాంక నిర్జీవంగా మంచంపై కనిపించింది.  ఈ వివరాలన్నిటినీ ప్రియాంక కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పి.. అత్తారే ఆమెను చంపేశారంటూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement