అమెరికా పౌరసత్వ బిల్లుకు దిగువ సభ పచ్చజెండా

ABN , First Publish Date - 2021-03-20T05:19:15+05:30 IST

అమెరికా ప్రతినిధుల సభ (దిగువ సభ) కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. 228-197 ఓట్ల మెజార్టీ‌తో పచ్చజెండా ఊపింది. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు.. సెనేట్‌లో గట్టెక్కి, బైడెన్ సంతకంతో చట్టరూపం దాల్చితే.. దాదాపు 5లక్షల మంది భారతీయులు లబ్ధి పొందనున్నారు.

అమెరికా పౌరసత్వ బిల్లుకు దిగువ సభ పచ్చజెండా

వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభ (దిగువ సభ) కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. 228-197 ఓట్ల మెజార్టీ‌తో పచ్చజెండా ఊపింది. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు.. సెనేట్‌లో గట్టెక్కి, బైడెన్ సంతకంతో చట్టరూపం దాల్చితే.. దాదాపు 5లక్షల మంది భారతీయులు లబ్ధి పొందనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అక్రమవలసదారులపై జో బైడెన్ వరాలు కురిపించారు. ఎన్నికల్లో గెలిచి, అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తే 11 మిలియన్ల మంది అక్రమవలసదారులకు అమెరికా పౌరసత్వం ఇస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో బైడెన్.. ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్‌పై భారీ విజయం సాధించారు. జనవరి 20న అగ్రరాజ్య అధినేతగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై బైడెన్ దృష్టి సారించారు. 



2021 జనవరి 21 ముందు సరైన ధ్రువపత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించిన 18ఏళ్లలోపు యువతకు ఆ దేశ పౌరసత్వం ఇచ్చేందుకు మార్గం సుగమం చేయాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ‘ది అమెరికన్ డ్రీమ్ అండ్ ప్రామిస్’ అనే పేరుతో ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టింది. కాగా.. ఈ బిల్లుకు ప్రతినిధుల సభ గురువారం ఆమోదం తెలిపింది. 228 మంది సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. సెనేట్‌లో కూడా ఈ బిల్లుకు ఆమోదం లభించి.. జో బైడెన్ సంతకంతో చట్ట రూపం దాల్చితే.. లక్షలాది మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వారి పిల్లలకు, హెచ్1బీ వీసా ద్వారా వచ్చిన టెక్ నిపుణుల పిల్లలకు, తల్లిదండ్రులు సరైన పత్రాలతో అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టినా.. వారి పిల్లలను అక్రమవలసదారుల గుర్తించినట్టైతే అలాంటి వారికి కూడా ఈ చట్టం ద్వారా అమెరికా పౌరసత్వం లభించనుంది.


Updated Date - 2021-03-20T05:19:15+05:30 IST