‘మీ గడ్డంపై ఏదో ఉంది’.. పొరబాటున కెమెరాకు చూపించిన బైడెన్‌

ABN , First Publish Date - 2021-08-01T03:53:22+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మరోసారి తన పొరపాటుతో వార్తల్లో నిలిచారు. శుక్రవారం నాడు ఒక వర్చువల్ మీటింగ్‌లో

‘మీ గడ్డంపై ఏదో ఉంది’.. పొరబాటున కెమెరాకు చూపించిన బైడెన్‌

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మరోసారి తన పొరపాటుతో వార్తల్లో నిలిచారు. శుక్రవారం నాడు ఒక వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయనకు సహాయకులు ఒక నోట్ పంపించారు. దాన్ని చదివే సమయంలో ఆయన ఆ కాగితాన్ని పొరపాటున కెమెరాకు చూపించారు. ఆ పేపర్‌పై ‘‘సార్.. మీ గడ్డంపై ఏదో ఉంది’’ అని రాసి ఉంది. దాన్ని చదవడానికి ప్రయత్నించిన బైడెన్ ఆ పేపర్ ముక్కను ముందుగా వెనక్కు తిప్పి చూశారు. ఆ సమయంలోనే ఆ పేపర్‌పై ఏముందో కెమెరా కంటికి చిక్కింది. ఆ సమయంలో బైడెన్ గడ్డంపై పచ్చగా ఏదో పదార్థం ఉంది. అది గుడ్డుసొనలా కనిపించింది. తన సహాయకులు అందించిన పేపర్‌పై మెసేజిని చదివిన వెంటనే బైడెన్ తన గడ్డం తుడుచుకున్నారు. ఈ పేపర్‌ను ఆండ్రూ హార్నిక్ అనే ఫొటో జర్నలిస్టు తన కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఈ ఫొటో, వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీన్ని కొందరు సరదాగా తీసేస్తే, కొందరు మాత్రం బైడెన్‌పై కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2021-08-01T03:53:22+05:30 IST