మ‌రో భార‌తీయ అమెరిక‌న్‌ను కీల‌క ప‌ద‌వికి నామినేట్ చేసిన బైడెన్‌!

ABN , First Publish Date - 2021-05-27T18:24:54+05:30 IST

ఇప్ప‌టికే ప‌లువురు భార‌తీయ అమెరిక‌న్ల‌ను ప‌లు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ తాజాగా మ‌రో భార‌త సంత‌తి వ్య‌క్తిని మ‌రో కీల‌క ప‌ద‌వికి నామినేట్ చేశారు. ఇండో-అమెరిక‌న్‌ అరుణ్​ వెంకట‌రామ‌న్‌ను అమెరికా, విదేశీ వాణిజ్య సేవల డైరెక్టర్ జనరల్​గా బుధ‌వారం బైడెన్ నామినేట్ చేశారు. అలాగే గ్లోబల్ మార్కెట్స్ అసిస్టెంట్ సెక్రటరీగానూ..

మ‌రో భార‌తీయ అమెరిక‌న్‌ను కీల‌క ప‌ద‌వికి నామినేట్ చేసిన బైడెన్‌!

వాషింగ్ట‌న్‌: ఇప్ప‌టికే ప‌లువురు భార‌తీయ అమెరిక‌న్ల‌ను ప‌లు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ తాజాగా మ‌రో భార‌త సంత‌తి వ్య‌క్తిని మ‌రో కీల‌క ప‌ద‌వికి నామినేట్ చేశారు. ఇండో-అమెరిక‌న్‌ అరుణ్​ వెంకట‌రామ‌న్‌ను అమెరికా, విదేశీ వాణిజ్య సేవల డైరెక్టర్ జనరల్​గా బుధ‌వారం బైడెన్ నామినేట్ చేశారు. అలాగే గ్లోబల్ మార్కెట్స్ అసిస్టెంట్ సెక్రటరీగానూ వెంకట‌రామ‌న్‌ను నియ‌మించే యోచ‌న‌లో బైడెన్ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇక గత 20ఏళ్లుగా ఎన్నో కంపెనీలు, అంతర్జాతీయ సంస్థల‌తో పాటు అంతర్జాతీయ వాణిజ్య సమస్యలపై యూఎస్‌ ప్రభుత్వానికి వెంకట‌రామ‌న్‌ సలహాదారుగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న అమెరికా వాణిజ్య కార్యదర్శికి కౌన్సిలర్‌గా, వాణిజ్య విభాగానికి మరియు ఇతర అంతర్జాతీయ ఆర్థిక విషయాలపై సలహాదారుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతకుముందు వీసా విభాగంలో వెంకట‌రామ‌న్‌ సీనియర్ డైరెక్టర్​గా విధులు నిర్వ‌హించారు. కాగా, యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో లా క్ల‌ర్క్‌గా వెంకట‌రామ‌న్ తన కెరీర్‌ను ప్రారంభించారు.    

Updated Date - 2021-05-27T18:24:54+05:30 IST