తొలిరోజే కీలక నిర్ణయాలు తీసుకోనున్న బైడెన్!

ABN , First Publish Date - 2021-01-18T00:45:43+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై జో బైడెన్ ఘన విజయం సాధించి.. ఈ నెల 20న అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాకు

తొలిరోజే కీలక నిర్ణయాలు తీసుకోనున్న బైడెన్!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై జో బైడెన్ ఘన విజయం సాధించి.. ఈ నెల 20న అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాకు పూర్వ వైభవం తీసుకురావడానికి బైడెన్ ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో బైడెన్ చీఫ్ ఆఫ్ స్టాప్‌గా మరికొద్ది రోజుల్లో బాధ్యతలు చేపట్టబోతున్న రాన్ క్లెయిన్ పలు కీలక విషయాలు వెల్లడించారు. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే పారిస్ ఒప్పందంలో అమెరికా చేరికకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై బైడెన్ సంతకం చేస్తారని రాన్ క్లెయిన్ పేర్కొన్నారు. అంతేకాకుండా ముస్లిం దేశాలకు రాకపోకలపై విధించిన నిషేధంపై బైడెన్ తుది నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. కొవిడ్ నిబంధనలను కఠినతరం చేయడంతోపాటు జాతి వివక్షపై ఉక్కుపాదం మోపే నిర్ణయాలను బైడెన్ ప్రకటించే అవకాశం ఉందని రాన్ క్లెయిన్ వివరించారు. బాధ్యతలు చేపట్టిన తొలి రోజే దాదాపు 12 కీలక ఆర్డర్‌లపై బైడెన్ సంతకం చేస్తారని కాబోయే చీఫ్ ఆఫ్ స్టాప్ పేర్కొన్నారు. 


Updated Date - 2021-01-18T00:45:43+05:30 IST