‘పోటస్’ అకౌంట్ గా మారనున్నబైడెన్ ట్విటర్ ఖాతా... బుధవారం ముహూర్తం...

ABN , First Publish Date - 2021-01-18T00:09:59+05:30 IST

అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ ఈ నెల 20 వ తేదీన పదవి చేపట్టగానే ఆయనకు సంబంధించిన ట్విటర్ కొత్త ఖాతా ప్రారంభం కానుంది. కాగా ఆ ఖాతాను ఇక నుంచి ‘పోటస్’గా వ్యవహరిస్తారు. వివరాలిలా ఉన్నాయి.

‘పోటస్’ అకౌంట్ గా మారనున్నబైడెన్ ట్విటర్ ఖాతా...  బుధవారం ముహూర్తం...

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ ఈ నెల 20 వ తేదీన  పదవి చేపట్టగానే ఆయనకు సంబంధించిన ట్విటర్ కొత్త ఖాతా ప్రారంభం కానుంది. కాగా ఆ ఖాతాను ఇక నుంచి ‘పోటస్’గా వ్యవహరిస్తారు. వివరాలిలా ఉన్నాయి.


మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా  హయాం నుంచే ఈ పోటస్ ట్విటర్ విధానం అమల్లోకి వచ్చింది. కాగా వైట్‌హౌస్ వర్గాలు మాత్రం తాజాగా దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఇక... బైడెన్ వ్యక్తిగత ట్విటర్ ఖాతాలో 24 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ నెల 20 న  బైడెన్ ప్రభుత్వానికి ట్విటర్ తన అధికారిక లాంఛనాలను అందజేయనుంది. జీరో ఫాలోవర్లతో ఇది లాంచ్ అవుతుంది. నాలుగేళ్ళ క్రితం... 2016 లో ట్రంప్ ప్రభుత్వం ట్విటర్ ఖాతాలను ఆయనకు అందజేయలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన నిర్ణయం ట్విటర్ కు, బైడెన్ ట్రాన్సిషన్ టీమ్ కు మధ్య ఆందోళన కలిగించే అంశంగా మారింది. అయితే తన ఫాలోవర్స్ గురించి బైడెన్ అంతగా ఆలోచించడం లేదని, దేశంలో ప్రతివారితోనూ కాంటాక్ట్ లో ఉండాలన్నదే ఆయన అభిమతమని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అటు... ట్రంప్ ఖాతాను ట్విటర్ స్తంభింపజేయక ముందు ఆయనకు 88 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉంటూ వచ్చారు.


ఇదిలా ఉంటే కొత్త అధ్యక్షునికి స్వాగతం పలకడానికి వైట్‌హౌస్ సమాయత్తమవుతోంది. కాగా... శ్వేత సౌధంలో చాలామంది భారతీయ అమెరికన్లే ఉండడం విశేషం. 

Updated Date - 2021-01-18T00:09:59+05:30 IST