Oct 22 2021 @ 19:18PM

ఈ BIG B బిగ్గెస్ట్ ఫ్యాన్... ఏం చేశాడో తెలిస్తే అవాక్కవుతారు!

బిగ్ బి అమితాబ్ బచ్చన్ తాజాగా షేర్ చేసిన ఓ ఫోటో ఇన్‌స్టాగ్రామర్స్‌ని తెగ ఆకట్టుకుంటోంది. అందులో తన వీరాభిమానితో బచ్చన్ జీ కనిపించారు. ఈ హార్డ్‌కోర్ బిగ్ బి ఫ్యాన్ స్పెషాలిటీ ఏంటంటే, ఆయన తన కారుని మొత్తం అమితాబ్ సూపర్ హిట్ డైలాగ్స్‌తో నింపేశాడు. అతడితో తన మీటింగ్, అప్పుడు తీసిన ఫోటోలు స్వయంగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఆన్‌లైన్‌లో షేర్ చేశారు...  


‘‘అతడి షర్ట్ మీద నా సినిమాల పేర్లన్నీ ఉన్నాయి! అతడి కార్ డోర్ తెరవగానే అందులోని సౌండ్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా నా డైలాగ్స్ ప్లే చేస్తుంది!’’ అంటూ వివరించిన అమితాబ్ బచ్చన్, ‘‘నేను డాష్‌బోర్డ్ మీద ఆటోగ్రాఫ్ సైన్ చేసేదాకా ఆయన తన కొత్త కారుని డ్రైవ్ కూడా చేయలేదు!’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. బిగ్ బి బిగ్గెస్ట్ ఫ్యాన్ వీరాభిమానం చూసి నెటిజన్స్ చాలా మంది అవాక్కవుతున్నారు. ఇక బచ్చన్ అభిమానులైతే తమ తోటి హార్డ్‌కోర్ ఫ్యాన్ హల్‌చల్ చూసి తెగ మురిసిపోతున్నారు...