Sep 22 2021 @ 12:46PM

అక్టోబర్ 3 నుంచి ‘బిగ్‌బాస్‌ 5’ తమిళ్ ప్రారంభం

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్‌’తమిళ రియాల్టీ షో వచ్చే నెల మూడో తేదీ నుం చి ప్రముఖ టీవీలో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ఆయనే అధికారికంగా ప్రకటించారు. ‘బిగ్‌ బాస్‌ రియాల్టీ షో ఐదో సీజన్‌ వచ్చే నెల మూడో తేదీ సాయత్రం 6 గంటల నుంచి విజయ్‌ టీవీలో ప్రసారమవుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు జరిగిన నాలుగు సీజన్లకు కమ ల్‌ హోస్ట్‌గా వ్యవహరించారు. ఇపుడు ఐదో సీజన్‌కు కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ షో కోసం ఎంపికైన కంటెస్టెంట్స్‌ ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్న విషయం తెల్సిందే.