Abn logo
Feb 27 2020 @ 22:53PM

బికినీకి రెడీ.. నయనతారలో బిగ్ ఛేంజ్

వాటికి సై అంటున్న నయనతార. వేటికి అంటే....చిట్టిపొట్టి డ్రస్సులకు, బికినీలకు, ముద్దుసీన్లకు సై అంటోందట! నాలుగైదేళ్ళ నుంచి ఈ భామ వాటికి దూరంగా ఉంటోంది. అలాంటి కథలతో వచ్చేవారి మాటలు కూడా వినేది కాదు. అలాంటిది. పై వాటికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తోంది. కథ డిమాండ్‌ చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. నయనలో ఈ మార్పును చూసి దర్శకనిర్మాతలు పండగ చేసుకుంటున్నారట.


ఎందుకంటే....ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌ అనదగిన వారిలో నయనతార తప్ప ఎవరూ లేరు. అలాంటి నయనతారతో బికినీలు వేయించి ముద్దు సీన్లు పెడితే సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడం ఖాయమని అంటున్నారట. నయనతార ఇప్పుడు ఈ నిర్ణయానికి కారణం ఆమెకు సినిమాలు లేకపోవడమే అంటున్నారు. నయన ఎంత మంచి నటి అయినా, కుర్ర హీరోయిన్ల గ్లామర్‌ షో ముందు తన నటన తేలిపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చిందట.

Advertisement
Advertisement
Advertisement