Abn logo
Apr 7 2020 @ 23:25PM

కరోనా ఎఫెక్ట్: మల్టీఫ్లెక్స్ థియేటర్స్‌ని మార్చేస్తున్నారు

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. లాక్‌డౌన్ ప్రకటించి దేశదేశాల మధ్య రాకపోకలు లేకుండా పోయాయి. కరోనా బారి నుంచి ఎలా బయటపడాలా అని ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు మందు కనిపెట్టని ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ పతనమవుతుంది. కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పుడు ప్రజలందరూ కలిసి పలకరించుకోలేని పరిస్థితి నెలకొంది. ఇక సినీ పరిశ్రమ విషయానికి వస్తే దీని ప్రభావం కాస్త గట్టిగానే ఉంది. షూటింగ్స్ లేక ఎందరో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ లాక్‌డౌన్ తీసేస్తారా? షూటింగ్స్ మొదలవుతాయా? అని ఎంతగానో వారు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ ఎత్తేసి, థియేటర్స్‌లో సినిమాలు రన్ అయ్యేది ఎప్పుడో తెలియదు కానీ, మల్టీఫ్లెక్స్ థియేటర్స్ యాజమాన్యం మాత్రం థియేటర్స్ విషయంలో కీలకమైన మార్పులు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.


ఇకపై మల్టీఫ్లెక్స్ థియేటర్స్‌లో సామాజిక దూరం పాటిస్తూ సీటు సీటుకు మధ్య గ్యాప్ ఉండేలా.. మొత్తం 500 సిటింగ్ ఉండే థియేటర్‌లో కేవలం 150 సిటింగ్ మాత్రమే ఉండేలా మార్పులు చేస్తున్నారట. అలాగే థియేటర్స్‌లోనికి వచ్చే ప్రేక్షకులకు ఫేస్ మాస్క్‌ని ఫ్రీగా అందించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా షో పూర్తవ్వగానే థియేటర్ అంతా శానిటైజర్ స్ప్రే చేసేలా ఏర్పాట్లు చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట. దీనికి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయని, త్వరలోనే ఈ మార్పులతో మల్టీఫ్లెక్స్ థియేటర్స్ ముస్తాబవుతాయని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. 

Advertisement
Advertisement
Advertisement