Abn logo
May 27 2020 @ 20:15PM

బర్త్‌డేకి బాలయ్య ఇవ్వబోతోన్న ట్రీట్ ఇదే

ఈ మధ్య నందమూరి హీరోలు ఫ్యాన్స్‌ను బాగా డిజప్పాయింట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) పుట్టినరోజున అభిమానులందరూ ఎంతగా డిజప్పాయింట్ అయ్యారో, ఎందుకు అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ వల్ల ఎన్టీఆర్ తన పుట్టినరోజున అభిమానులకు ట్రీట్ ఇవ్వలేకపోయాడు. అయితే నందమూరి నటసింహం బాలయ్య మాత్రం తమ అభిమానులకు రాబోయే తన పుట్టినరోజున అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం. ఈ గిఫ్ట్ ఏమిటో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు కూడా.


లెజండరీ నటుడు, నటరత్న నందమూరి తారక రామారావు నటించిన ‘జగదేకవీరుని కథ’ చిత్రంలోని ‘శివశంకరీ.. శివానందలహరి శివశంకరీ’ అనే సాంగ్ ఎటువంటి సంచలనం సృష్టించిందో తెలియంది కాదు. ఇప్పటికీ ఈ పాట వస్తుందంటే అందరూ అలా నిలబడి వినాల్సిందే.. చూడాల్సిందే. పింగళి నాగేంద్ర రావ్ రచించిన ఈ పాటను లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు కంపోజ్ చేయగా.. మరో లెజెండరీ గాయకుడు ఘంటసాల ఈ పాటను పాడారు. తన పుట్టినరోజు కానుకగా నందమూరి నటసింహం బాలయ్య ఈ పాటను పాడబోతున్నారట. యాజమాన్య సంగీత సారథ్యంలో సింగర్ స్మిత సహకారంతో బాలయ్య ఈ పాటను పాడుతున్నట్లుగా సమాచారం. తన పుట్టినరోజు అనగా జూన్ 10న ఈ పాటను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి నిజంగా ఇది నిజమైతే మాత్రం నందమూరి అభిమానులకు ఇంతకన్నా పెద్ద ట్రీట్ ఉండదేమో..

Advertisement
Advertisement
Advertisement