Abn logo
Sep 18 2020 @ 20:33PM

ఆ ఛానల్‌ లెక్కలు మార్చేసిన ‘బిగ్ బాస్-4’

Kaakateeya

స్టార్‌ మా తెలుగు జనరల్‌ ఎంటర్‌టైన్‌మైంట్‌ చానల్స్‌లో టాప్‌ స్ఠానంలో కొనసాగుతుంది. ఇటీవల మొదలైన బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 4  లాంఛింగ్‌ ఎపిసోడ్‌ రేటింగ్‌.. రికార్డ్‌ను క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే.  అంతేకాదు నాన్‌ ఫిక్షన్‌ షో కేటగిరీలో బార్క్‌ యూనివర్స్‌లో ఇప్పటివరకు రానంతగా అత్యధిక రేటింగ్స్‌ సాధించిన ఎపిసోడ్‌గా బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 4 లాంచింగ్‌ ఎపిసోడ్‌ నిలిచినట్లుగా స్టార్‌ మా అధికారికంగా ప్రకటించింది. అలాగే తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ప్రసారమైన బిగ్‌ బాస్‌ షోలకు సంబంధించి.. అన్నిటికంటే అత్యధిక టీఆర్పీ 18.5ని ఈ షో సాధించినట్లుగా కూడా స్టార్‌ మా తెలిపింది. స్టార్‌ మా చెబుతున్న గణాంకాలను బట్టి చూస్తే.. స్టార్‌ మా గతంలో లేనంతగా అత్యధికంగా 1122 జీపీఆర్‌లతో తెలుగు జనరల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కేటగిరీలో టాప్‌ స్థానంలో కొనసాగుతోంది. గత నాలుగు వారాలతో పోలిస్తే స్టార్‌ మా సరికొత్త బ్రాండ్‌ ఐడెంటిటీ 18 శాతం పెరిగినట్లుగా రివీల్‌ చేసింది. అయితే బిగ్ బాస్‌ సీజన్‌ 4 విషయానికి వస్తే.. సరైన కంటెస్టెంట్స్ లేని ఈ షో నిలబడటం చాలా కష్టమే అని ఇప్పటికీ.. బిగ్‌ బాస్‌ వ్యూవర్స్ అనుకుంటుండటం విశేషం.

‘కార్తీకదీపం’ బీట్‌ చేయలేకపోయిన ‘బిగ్ బాస్-4’ 

ఇదిలా ఉంటే..‘బిగ్ బాస్-4’ ఫస్ట్ వీక్ రిజల్ట్ మరోలా ఉంది. కంటెస్టెంట్స్ వీక్‌గా ఉన్నారనే కామెంట్స్ ‘బిగ్ బాస్-4’ని చుట్టుముట్టినా.. ఈ రియాలిటీ షో ఓపెనింగ్ ఎపిసోడ్‌కు మాత్రమే అత్యధిక (18.5) టీఆర్పీ రావటం విశేషం. ఇది మంచి రేటింగే అయినా... ‘మా’లోనే ప్రసారమవుతున్న ‘కార్తీకదీపం’, ‘గృహలక్ష్మి’ సీరియల్స్ రేటింగ్ ను మాత్రం ఈ షో బీట్‌ చేయలేకపోయింది. కార్తీక దీపం మొదటి ఆరు స్థానాల్లో నిలవగా... ఆ తర్వాత గృహలక్ష్మి, ఆపై బిగ్ బాస్-4 నిలవటం గమనార్హం.

Advertisement
Advertisement
Advertisement