Aug 1 2021 @ 12:58PM

బిగ్‌బాస్ 5 ప్రోమో వచ్చేసింది.. ప్రసారం ఎప్పుడంటే?

తెలుగులో పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌నే వార్త‌లు కొన్నిరోజులు వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు బిగ్‌బాస్ 5 సెప్టెంబ‌ర్ నుంచి ప్ర‌సారం అవుతుంది. కాగా.. బిగ్‌బాస్ 5 తెలుగు ప్రోమోను స్టార్ మా ఈరోజు రిలీజ్ చేసింది. ఈ సీజ‌న్ 5ను నాగార్జున హోస్ట్ చేయ‌డ‌ని, రానా హోస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని కూడా రీసెంట్‌గా వార్త‌లు వినిపించాయి. కానీ నాగార్జునే హోస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.