Abn logo
Jul 9 2020 @ 19:15PM

బిగ్‌బాస్ 4లోకి స్వీటీ.. అందుకేనా ఈ హడావుడి

సంచలన దర్శకుడు వర్మ వదిలిన బాణం స్వీటీ అదే శ్రీరాపాక ఈ మధ్య వరుసగా యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఫేమస్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఆమె నటించిన ‘నగ్నం’ చిత్రం వర్మ థియేటర్‌లో పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. అలాంటి సినిమాలో చేసిన తర్వాత.. వేరే ఎవరైనా అయితే కొంతకాలం పాటు మీడియాకి ముఖం చాటేస్తారు. కానీ.. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఆమెలో మరింత జోష్ పెరిగింది. ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక హాట్ టాపిక్ మాట్లాడి.. హైలెట్ అవుతుంది. అయితే ఈ భామ ఇంత హడావుడి చేస్తుంది ఏంటబ్బా.. అని అందరూ అనుకుంటున్న తరుణంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.


ఈ భామ ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4’ కోసమే ఇంత అటెన్షన్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. ఆమె అనుకున్నట్లుగానే బిగ్‌బాస్ నిర్వాహకుల దృష్టిలో పడిందని, త్వరలో మొదలు కాబోయే సీజన్ 4లో ఈ భామ కూడా ఓ కంటెస్టెంట్ అంటూ అప్పుడే వార్తలు కూడా మొదలయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఎక్కడా ఈ ప్రస్తావన రాలేదు. ఇకపై ఇచ్చే, వచ్చే ఇంటర్వ్యూలలో ఏమైనా దీనిపై స్పందిస్తుందేమో చూడాలి. ఏదిఏమైనా వర్మ పేల్చిన బాంబ్‌గా ఈ భామ బాగానే క్రేజ్ సంపాదిస్తుంది.

Advertisement
Advertisement
Advertisement