Abn logo
Jul 7 2020 @ 23:40PM

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 హోస్ట్‌గా రౌడీస్టార్

కరోనా మహమ్మారి కారణంగా ఏదీ సక్రమంగా జరగడం లేదు. ప్రభుత్వాలు షూటింగ్స్‌కు అనుమతిని ఇచ్చినా.. పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో.. ఎవరూ ధైర్యం చేయడం లేదు. వెండితెర సంగతి పక్కన పెడితే బుల్లితెర సీరియల్స్‌ షూటింగ్స్‌ కూడా ఇప్పుడు ఆగిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో మరోసారి బుల్లితెరపై సంచలనం సృష్టించిన ‘బిగ్‌బాస్’ షో గురించి వార్తలు వినిపిస్తున్నాయి. కంటెస్టెంట్స్ గురించి ఇప్పటికే ఓ లిస్ట్ బయటికి వచ్చేసింది. ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4’కు సంబంధించి ఇప్పటి వరకు హోస్ట్ విషయలో తారక్, సమంత, నాగ్ అంటూ వార్తలు వినిపించాయి. తాజాగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పేరు వినబడుతుంది.


కంటెస్టెంట్స్ విషయంలోగానీ, హోస్ట్ విషయంలోగానీ, అసలు సీజన్ 4 గురించి బిగ్‌బాస్ నిర్వాహకులు ఎటువంటి ప్రకటన చేయడం లేదు కానీ.. వార్తలు మాత్రం కుప్పలుకుప్పలుగా పుట్టుకొస్తున్నాయి. నిజంగా విజయ్ దేవరకొండ చేస్తే.. ఈ షోకి ఫ్రెష్ ఫీల్ వస్తుంది కానీ, ఒకవైపు ఆయన సినిమా షూటింగ్‌కే వెళ్లలేక ఇంట్లో కూర్చుని ఉంటే.. ఇంక ఈ షోను ఎలా రన్ చేస్తాడనే దానిపై క్లారిటీ లేదు. ఈ విషయంలో బిగ్‌బాస్ నిర్వాహకులు క్లారిటీ ఇస్తేనే గానీ, లేదంటే.. ఇలాగే రోజుకో స్టార్‌ని హోస్ట్‌గా చేసి ఆకతాయిలు సోషల్ మీడియాలో వదులుతుంటారు.

Advertisement
Advertisement
Advertisement