సమ్మర్‌ ప్యాక్స్‌!

ABN , First Publish Date - 2020-03-06T05:30:00+05:30 IST

ఎండాకాలం వేధించే అతి పెద్ద సమస్య. ‘సన్‌ ట్యాన్‌’. సన్‌స్ర్కీన్‌ లోషన్లు, గొడుగులు, దుపట్టాలు... వాడుతూ ఎంత జాగ్రత్తగా ఉన్నా ..

సమ్మర్‌ ప్యాక్స్‌!

ఎండాకాలం వేధించే అతి పెద్ద సమస్య. ‘సన్‌ ట్యాన్‌’. సన్‌స్ర్కీన్‌ లోషన్లు, గొడుగులు, దుపట్టాలు... వాడుతూ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎండకు చర్మం నల్లగా తయారవటం మానదు. ఇలాంటప్పుడు క్రమం తప్పకుండా ట్యాన్‌ను తొలగించే ఫేస్‌ ప్యాక్స్‌ వేసుకుంటూ ఉండాలి. 

కుంకుమ పువ్వు ప్యాక్‌: 4 టేబుల్‌స్పూన్ల పాలు వేడిచేసి దానిలో నాలుగు చుక్కల నిమ్మరసం, చిటికెడు కుంకుమ పువ్వు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, చెవులు, మెడలకు పట్టించి ఆరాక చల్లని నీళ్లతో కడిగేయాలి. తర్వాత మాయిశ్చరైజర్‌ రాయాలి.

టొమాటో ప్యాక్‌: ఒక టొమాటోను తరిగి దానికి ఒక టేబుల్‌స్పూను పాలు చేర్చాలి. ఒక టీస్పూను పసుపు, నాలుగు చుక్కల నిమ్మరసం, ఒక టీస్పూను తేనె వేసి బాగా కలిపి పట్టించాలి. ఆరాక చల్లని నీటితో కడిగేసుకోవాలి.

సెనగపిండి ప్యాక్‌: రెండు టేబుల్‌ స్పూన్ల సెనగపిండికి చిటికెడు పసుపు, అర టీస్పూను నారింజ తురుము, ఒక టీస్పూను రోజ్‌ వాటర్‌ వేసి కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాలు ఆగి ఆరిపోయిన ప్రదేశాల్లో రోజ్‌ వా టర్‌ చిలకరించాలి. తర్వాత వేళ్లతో సున్నితంగా రుద్దుతూ ప్యాక్‌ తొలగించి కడిగేసుకోవాలి. ఇలా రెండు రోజులకోసారి చేయాలి.


Updated Date - 2020-03-06T05:30:00+05:30 IST