బీహార్ బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా

ABN , First Publish Date - 2022-01-10T00:33:55+05:30 IST

బీహార్‌లోని నర్కటీయగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రష్మి వర్మ..

బీహార్ బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా

పాట్నా: బీహార్‌లోని నర్కటీయగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రష్మి వర్మ అనూహ్యంగా పార్టీకి షాక్ ఇచ్చారు. తన శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలంటూ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాకు ఆదివారంనాడు లేఖ రాశారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్టు ఆమె తన రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. కాగా, రష్మి వర్మ అనూహ్య నిర్ణయానికి కారణమేమిటనేది వెంటనే తెలియలేదు. బీజేపీ నేతలు కూడా దీనిపై ఇంతవరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నర్కటీయగంజ్ నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్‌పై రష్మి వర్మ పోటీచేసి గెలుపొందారు. ఆమె రాజీనామాతో అసెంబ్లీలో బీజేపీ బలం 73కి తగ్గింది.

Updated Date - 2022-01-10T00:33:55+05:30 IST