బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేడు

ABN , First Publish Date - 2020-09-25T14:49:17+05:30 IST

బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు ఖరారు కానుంది....

బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేడు

 న్యూఢిల్లీ : బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు ఖరారు కానుంది. బీహార్ ఎన్నికల తేదీల ప్రకటనకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీలోని కార్యాలయంలో మధ్యాహ్నం 12.30 గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీ పదవీ కాలం నవంబరు 29వతేదీతో ముగియనుంది. దీంతో శుక్రవారం ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. కరోనా సంక్షోభ సమయంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనుండటం దేశంలోనే మొట్టమొదటిసారి. 


ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండటంతో బీహార్ అసెంబ్లీ పోరుకు అన్ని రాజకీయ పక్షాల నేతలు సమాయత్తమయ్యారు. వివిధ పార్టీలు ఎన్నికల్లో తమ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల మేనిఫెస్టోల తయారీపై దృష్టిసారించాయి. ఎన్నికల తేదీలు ఖరారు అయితే బీహార్ రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులోకి రానుంది. 

Updated Date - 2020-09-25T14:49:17+05:30 IST