Omicron ఎఫెక్ట్: అక్కడ స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు బంద్!

ABN , First Publish Date - 2022-01-07T17:52:41+05:30 IST

రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు దేశాన్ని హడలెత్తిస్తున్నాయి

Omicron ఎఫెక్ట్: అక్కడ స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు బంద్!

రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు దేశాన్ని హడలెత్తిస్తున్నాయి. మూడో వేవ్ మొదలైందనే సంకేతాలను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని అనుకుంటున్నాయి. ఈ విషయంలో బీహార్ ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్రంలోని స్కూళ్లకు, కాలేజీలకు, కోచింగ్ సెంటర్లకు, హాస్టళ్లకు సెలవులు ఇస్తున్నట్టు బీహార్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 


ఈ నెల 21 వరకు వాటన్నింటినీ మూసెయ్యాలని ఆదేశించింది. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించుకోవాలని సూచించింది. ఇక, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను 50 శాతం మంది సిబ్బందితో మాత్రమే నడిపించాలని సూచించింది. అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కూడా విధించింది. బుధవారం ఒక్క రోజే బీహార్‌లో 1659 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 3697 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  

Updated Date - 2022-01-07T17:52:41+05:30 IST