Abn logo
Sep 14 2021 @ 11:29AM

49 వేల హెల్మెట్లు పంపిణీ చేసిన బీహారీ... కథనం షేర్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్!

పట్నా: రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన స్నేహితుడిని గుర్తుచేసుకుంటూ బీహార్‌కు చెందిన ఇంజినీరు రాఘవేంద్ర కుమార్ గడచిన ఏడేళ్లుగా ఉచితంగా వాహనదారులకు హెల్మెట్లు పంచుతున్నారు. ఇంతవరకూ రాఘవేంద్ర మొత్తం 49 వేల హెల్మెట్లను పంపిణీ చేశారు. రాఘవేంద్ర భారీ‌గా హెల్మెట్లు కొనుగోలు చేసేందుకు తన విలువైన భూములను, ఇంటిని కూడా విక్రయించారు. 

ఆయన సేవలను గుర్తించి ‘హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనే బిరుదను ప్రదానం చేశారు. ఇటీవల రాఖీ సందర్భంగా రాఘవేంద్ర కుమార్ మహిళలకు 172 హెల్మెట్లను పంపిణీ చేశారు. రాఘవేంద్ర కుమార్ హెల్మెట్ల పంపిణీ గురించి తెలుసుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఆయనను అభినందించారు. కాగా ‘హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ గురించి ఒక వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

ప్రత్యేకంమరిన్ని...