human rights: ఖైదీల ఫిర్యాదుతో పరిశీలనకు జైలుకు మానవహక్కుల బృందం

ABN , First Publish Date - 2021-08-06T18:45:59+05:30 IST

బెట్టయ్య జైలు సూపరింటెండెంట్ సంజయ్ గుప్తాపై 100 మంది ఖైదీలు చేసిన ఫిర్యాదులతో బీహార్ మానవ హక్కుల కమిషన్ స్పందించింది....

human rights: ఖైదీల ఫిర్యాదుతో పరిశీలనకు జైలుకు మానవహక్కుల బృందం

పట్నా (బీహార్):  బెట్టయ్య జైలు సూపరింటెండెంట్ సంజయ్ గుప్తాపై 100 మంది ఖైదీలు చేసిన ఫిర్యాదులతో బీహార్ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. బెట్టయ్య జైలులో సూపరింటెండెంట్, వార్డర్లు డబ్బు తీసుకొని తమకు బయటి వస్తువులు అందజేస్తున్నారని 100 మంది ఖైదీలు బీహార్ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో తాము ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని విచారణ కోసం జైలుకు పంపించారు.తనపై ఖైదీలు చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని జైలు సూపరింటెండెంట్ చెప్పారు.పదిమంది ఖైదీలను విచారించి తాము మానవహక్కుల కమిషన్ కు నివేదికను సమర్పిస్తామని రిజిష్ట్రార్ శైలేంద్రకుమార్ సింగ్ చెప్పారు.


Updated Date - 2021-08-06T18:45:59+05:30 IST