Advertisement
Advertisement
Abn logo
Advertisement

బ్యాంకు ఖాతాలో రూ.5.5 లక్షలు జమ అయినట్టు మెసేజ్.. మోదీ వేశారనుకుని ఖర్చు పెట్టేసిన తర్వాత..

అతడి బ్యాంక్ ఖాతాలో రూ.5.5 లక్షలు జమయ్యాయి.. ఆ డబ్బులను అతడు ఖర్చు పెట్టేశాడు.. ఇటీవల బ్యాంకు అధికారుల నుంచి అతడికి ఫోన్ వచ్చింది.. `మీ ఖాతాలో పొరపాటున రూ.5.5 లక్షలు జమయ్యాయి.. ఆ డబ్బును తిరిగి ఇచ్చేయండి` అని అడిగారు.. ఆ ప్రశ్నకు అతడు చెప్పిన సమాధానం విని బ్యాంకు అధికారులే షాకయ్యారు.. చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించారు.


ఇవి కూడా చదవండి

ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడికి పెద్ద కథే ఉంది.. స్టూడెంట్ నెంబర్1 సినిమాలో NTR లాగా..
ఇద్దరూ ఊరు వదిలి పారిపోయారు.. తిరిగి వచ్చాక యువతి తండ్రి, అన్న ఎంత దారుణానికి తెగించారంటే..

బిహార్‌లోని ఖగారియా ప్రాంతానికి చెందిన రంజిత్ దాస్ అనే వ్యక్తికి స్థానికంగా ఉన్న గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఉంది. ఈ ఏడాది మార్చి నెలలో బ్యాంకు అధికారుల పొరపాటు వల్ల రంజిత్ ఖాతాలో రూ.5.5 లక్షల రూపాయలు జమయ్యాయి. ఆ డబ్బును రంజిత్ ఖర్చు పెట్టేశాడు. తర్వాత తమ తప్పును గుర్తించిన బ్యాంకు అధికారులు రంజిత్‌కు ఫోన్ చేసి.. `చిన్న పొరపాటు వల్ల మీ ఖాతాలో రూ.5.5 లక్షలు జమయ్యాయి. ఆ డబ్బులను తిరిగి ఇచ్చేయండ`ని అడిగారు. 


అందుకు రంజిత్ స్పందిస్తూ.. `దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని ప్రధాని మోదీ చెప్పారు. మార్చి నెలలో నా ఖాతాలో పడిన డబ్బు దానిలో మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ అనుకున్నా. ఆ డబ్బు మొత్తం ఖర్చు పెట్టేశా. ఇప్పుడు తిరిగి ఇవ్వలేన`ని రంజిత్ తేల్చి చెప్పాడు. దీంతో బ్యాంకు మేనేజర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement