బీహార్ రెండవ దశ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే!

ABN , First Publish Date - 2020-10-18T12:50:34+05:30 IST

బీహార్ రెండవ దశ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం సాగించే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. వీరిలో ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఉంది.

బీహార్ రెండవ దశ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే!

పట్నా: బీహార్ రెండవ దశ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం సాగించే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. వీరిలో ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఉంది. బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ మొదలైనవారి పేర్లు రెండవ దశ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నాయి.


పార్టీ అధికారికంగా వెలువరించిన ఈ జాబితాలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, బీఎల్ సంతోష్. సౌదాన్ సింగ్ తదితరుల పేర్లు కూడా ఉన్నాయి. వీరితోపాటు బీహార్ బీజేపీ నేత భూపేంద్ర  యాదవ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్లను కూడా ఈ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారు. ఇదేవిధంగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, జార్ఖండ్ మాజీ సీఎం రఘువర దాస్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్ తదితరుల కూడా బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 

Updated Date - 2020-10-18T12:50:34+05:30 IST