Abn logo
Sep 26 2021 @ 00:24AM

ప్రజా వ్యతిరేక విధానాలపై బైక్‌ ర్యాలీ

పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న వామపక్ష పార్టీ నాయకులు

పెనుకొండ, సెప్టెంబరు 25: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 27న సోమవారం నిర్వహిస్తున్న భారతబంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సీపీఎం నాయకులు హరి, సీపీఐ నాయకులు రమేష్‌, మల్లికార్జున, తిప్పన్న, బాబావలి, రాజురావు, మల్లికార్జున, ఆధ్వర్యంలో కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని గాంధీ సర్కిల్‌, వైఎస్సార్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌, అంబేడ్కర్‌ సర్కిల్‌, దర్గా సర్కిల్‌, ఆర్టీసీ బస్టాండు, ఎస్కెడి సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ నల్లచట్టాలు, నాలుగు కార్మిక లేబర్‌కోడ్స్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 27న నిర్వహిస్తున్న భారతబంద్‌లో అన్ని కార్మిక, ప్రజా సంఘాలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘం నాయకులు మంజు, యూనియన నాయకులు చిన్నవెంకటేశ, తిప్పన్న, రిక్షా నరసింహులు, నరసింహులు, మంజు, చంద్ర, సోమందేపల్లి వెంకటేశ, హెచ నరసింహులు, ముత్యాలు, రాముడు, సూరీ తదితరులు పాల్గొన్నారు.