viral video: భూమిపై నూకలున్నాయంటే ఇదేనేమో.. బైక్పై వెళ్తూ ఓవర్టేక్ చేయబోయాడు.. బస్సు కింద పడినా..
ABN , First Publish Date - 2021-09-16T16:32:23+05:30 IST
అదృష్టం ఉంటే ఎలాంటి ప్రమాదం నుంచైనా సురక్షితంగా బయటపడవచ్చని అంటుంటారు.
అదృష్టం ఉంటే ఎలాంటి ప్రమాదం నుంచైనా సురక్షితంగా బయటపడవచ్చని అంటుంటారు. తాజాగా అలాంటిదే ఓ సంఘటన గుజరాత్లో జరిగింది. బస్సును ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేయబోయి బస్సు కింద పడిన వ్యక్తి సురక్షితంగా బయటకు వచ్చేశాడు.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన గుజరాత్లోని దాహోద్ ప్రాంతంలో జరిగింది.
దాహోద్ ప్రాంతంలోని రోడ్డుపై వెళ్తున్న బస్సును బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అది మలుపు కావడంతో అతడు అదుపు కోల్పోయి బస్సు కింద పడ్డాడు. అయితే డ్రైవర్ వెంటనే బ్రేక్ వెయ్యడంతో అతడికి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో భారీ వ్యూస్ దక్కించుకుంది. `వెరీ లక్కీ` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.