ఇన్‌స్టాలో బికినీ పిక్‌..!

ABN , First Publish Date - 2022-08-10T06:11:30+05:30 IST

ఆమె ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. ఆకర్షణీయమైన జీతం.. సదుపాయాలు. కానీ, ఒక ఫొటో ఆమె ఉద్యోగానికి ఎసరుపెట్టింది. ఆమె బికినీలో ఉన్న

ఇన్‌స్టాలో బికినీ పిక్‌..!

ఉద్యోగం నుంచి లేడీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ తొలగింపు 

ఆపై రూ. 99కోట్ల పరిహారానికి వర్సిటీ డిమాండ్‌


కోల్‌కతా, ఆగస్టు 9: ఆమె ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. ఆకర్షణీయమైన జీతం.. సదుపాయాలు. కానీ, ఒక ఫొటో ఆమె ఉద్యోగానికి ఎసరుపెట్టింది. ఆమె బికినీలో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడ మే పాపమైంది. దాంతో వర్సిటీ యాజమాన్యం ఆమె నుంచి బలవంతంగా రాజీనామా పత్రాన్ని తీసుకోవడమే కాకుండా.. విశ్వవిద్యాలయ పరువు పోగొట్టినందుకు.. రూ. 99 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేసింది. గత ఏడాది అక్టోబరు 7న కోల్‌కతాలోని జేవియర్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఓ మహిళ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఇన్‌స్టాలో ఉన్న ఓ ఫొటోను.. 18ఏళ్ల విద్యార్థి తన ఫోన్‌లో తదేకంగా చూస్తుండడాన్ని అతని తండ్రి గమనించి, వర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.


దీంతో వీసీ, రిజిస్ట్రార్‌ సదరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను విచారించారు. ఆమె చేసిన తప్పిదానికి రాజీనామాకు ఒత్తిడి చేశారు. అంతేకాదు.. వర్సిటీ పరువును పోగొట్టినందుకు రూ. 99 కోట్ల జరిమానా చెల్లించాలని హుకుం జారీ చేశారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రాజీనామాచేసినా..తన ఇన్‌స్టా ఖాతా హ్యాక్‌ అయ్యిందని, చేయని పాపానికి శిక్షను అనుభవించేలా చేస్తు న్న యాజమాన్యంపై న్యాయపోరాటం చేస్తానన్నారు.

Updated Date - 2022-08-10T06:11:30+05:30 IST