షష్ఠికి సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-12-09T05:33:30+05:30 IST

ఉభయ రాష్ట్రాల్లో పేరొందిన బిక్కవోలు శ్రీకుమారసుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి ఉత్సవానికి సర్వం సిద్ధం చేసినట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జేవీవీ సుబ్బారెడ్డి తెలిపారు.

షష్ఠికి సర్వం సిద్ధం

బిక్కవోలు, డిసెంబరు 8: ఉభయ రాష్ట్రాల్లో పేరొందిన బిక్కవోలు శ్రీకుమారసుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి ఉత్సవానికి సర్వం సిద్ధం చేసినట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జేవీవీ సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం తెల్లవారుజామున 1:15 నిమిషాలకు తీర్థపుబిందె సేవతో ఉత్సవాలు ప్రారంభిస్తామని, అప్పటినుంచి భక్తులకు స్వామి దర్శనాలు కల్పిస్తామన్నారు. ఆలయానికి తూర్పు, ఉత్తర ద్వారాల ద్వారా భక్తులకు ప్రవేశాలు కల్పించామని తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులందరికీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉచిత భోజన ఏర్పాట్లు చేశామని తెలిపారు. షష్ఠి సందర్భంగా మెయిన్‌రోడ్‌లో విద్యుత్‌ దీపాలతో ఏర్పాటు చేసిన దేవతామూర్తులు అందరినీ అలరిస్తున్నాయి.
భారీ బందోబస్తు
బిక్కవోలు షష్ఠి ఉత్సవంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నామని ఇన్‌చార్జి సీఐ శ్రీనివాసరావు తెలిపారు. రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు, హెచ్‌సీలు 30, ఉమెన్‌ పీసీలు 16, హోంగార్డులు 32,  పీసీలు 70 మందితో భద్రత కల్పిస్తున్నామన్నారు.  
 

Updated Date - 2021-12-09T05:33:30+05:30 IST