పాక్ ఉప ఎన్నికల్లో బిలావాల్ భుట్టో పార్టీ విజయం

ABN , First Publish Date - 2021-01-19T13:56:11+05:30 IST

పాక్ ఉప ఎన్నికల్లో బిలావాల్ భుట్టో పాకిస్థాన్ పీపుల్సు పార్టీ విజయం సాధించింది.....

పాక్ ఉప ఎన్నికల్లో బిలావాల్ భుట్టో పార్టీ విజయం

ఉమెర్‌కోట్ (పాకిస్తాన్) : పాక్ ఉప ఎన్నికల్లో బిలావాల్ భుట్టో పాకిస్థాన్ పీపుల్సు పార్టీ విజయం సాధించింది.  ప్రాథమిక ఫలితాల ప్రకారం ఉమెర్‌కోట్ ఉప ఎన్నికల్లో బిలావాల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్సు పార్టీ (పీపీపీ) విజయం సాధించింది. ఉమెర్ కోట్ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు తర్వాత గ్రాండ్ డెమోక్రటిక్ అలయెన్సు నాయకుడు అర్బాబ్ గులాం రహీంకు 30,921 ఓట్లు వచ్చాయి. పీపీపీ అభ్యర్థి అమీర్ అలీ షాకు 55,904 ఓట్లు సాధించినట్లు పాక్ మీడియా వెల్లడించింది. ఎన్నికల్లో విజయం తర్వాత విజేతను పీపీపీ నాయకుడు బిలావాల్ భుట్టో అభినందించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని తొలగించడానికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ఏకైక మార్గమని బిలావాల్  గత వారం చెప్పారు. 

Updated Date - 2021-01-19T13:56:11+05:30 IST