రూ.4600 కోట్ల బిల్‌గేట్స్ నౌక.. ఫీచర్స్ కేక..

ABN , First Publish Date - 2020-02-10T15:40:55+05:30 IST

ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు.. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు.. బిల్‌గేట్స్‌ (64) రూ.4600 కోట్లు పెట్టి అత్యంత విలాసవంతమైన యాట్‌ (విహార నౌక)ను కొనుగోలుచేశారు.

రూ.4600 కోట్ల బిల్‌గేట్స్ నౌక.. ఫీచర్స్ కేక..

ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు.. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు.. బిల్‌గేట్స్‌ (64) రూ.4600 కోట్లు పెట్టి అత్యంత విలాసవంతమైన యాట్‌ (విహార నౌక)ను కొనుగోలుచేశారు. 370 అడుగుల పొడుగు ఉండే ఈ నౌక పేరు.. ఆక్వా. దీంట్లో నాలుగు గెస్ట్‌ రూములు, రెండు వీఐపీ గదులు, యజమాని సూట్‌ ఉంటాయి. ఈ విలాసవంతమైన యాట్‌లో ఇంకెన్ని విశిష్టతలున్నాయో ఓ లుక్కేయండి..


మయసభను తలపించే ఆక్వాలోని హాల్.. ఈ నౌకలోని మొత్తం 31 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. 14 మంది అతిథులు ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లున్నాయి. 


ఆక్వాలో విలాసవంతమైన స్విమ్మింగ్‌పూల్ ఇది.. మేకప్‌ రూమ్‌, మసాజ్‌పార్లర్‌, కసరత్తులు చేయడానికి జిమ్‌, యోగాసనాలు వేసుకోవడానికి, ధ్యానానికి యోగా రూమ్‌ కూడా ఉన్నాయి.  


యాట్‌‌లోని విలాసవంతమైన బెడ్‌రూమ్ ఇది.. దీంట్లో నాలుగు గెస్ట్‌ రూములు, రెండు వీఐపీ గదులు, యజమాని సూట్‌ ఉంటాయి..


నౌక నడవడానికి ఉపయోగించే ద్రవ హైడ్రోజన్‌ను మైనస్‌ 253 డిగ్రీల ఉష్ణోగ్రతలో 2 ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. ఒక్కో ట్యాంకు సామర్థ్యం 28 టన్నులు. ఈ నౌక ప్రయాణించినప్పుడు కర్బన ఉద్గారాలూ వెలువడవు. నీళ్లు బయటకు వస్తాయంతే.


ఒక్కసారి ఈ నౌకలో ఇంధనాన్ని నింపితే 3750 మైళ్లు ప్రయాణిస్తుంది. నౌక వేగం గంటకు 17 నాటికల్‌ మైళ్లు. 



ఇందులో విలాసవంతమైన నౌకలోని బాల్కనీ.. ఇందులో కూర్చుని తెల్లవారుజామునైనా.. సాయంత్రం పూటయినా.. ప్రకృతిని చూస్తే మరింత రమణీయంగా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు..

Updated Date - 2020-02-10T15:40:55+05:30 IST