Abn logo
May 17 2021 @ 12:49PM

బిల్‌గేట్స్ జీవితంలో చీకటి కోణం.. విడాకులు అందుకేనా!?

వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి బిల్‌గేట్స్ గత ఏడాది మార్చి 13న వైదొలగిన విషయం తెలిసిందే. అకస్మాత్తుగా బోర్డు నుంచి ఆయన తప్పుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కార్యకాలపాలను విస్తృతపరిచేందుకే మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి బిల్‌గేట్స్ తప్పుకున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. తోటీ ఉద్యోగినితో శారీరక సంబంధం పెట్టుకున్న కారణంగానే ఆయన బోర్డు నుంచి తప్పుకున్నారనే వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి. దీంతో బిల్‌గెట్స్ దంపతుల విడాకులకు కూడా కారణం ఇదే అయ్యిండొచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. దీంతో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. 


వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. మైక్రోసాఫ్ట్‌లో పని చేస్తున్న ఓ ఉద్యోగినితో బిల్‌గేట్స్ అక్రమ సంబంధం పెట్టుకున్నారట. ఆమెకు ఇష్టం లేకపోయినప్పటికీ బిల్‌గేట్స్ సెక్సువల్ రిలేషన్‌ను కొనసాగించాడట. ఈ విషయంలో బాధితురాలు స్వయంగా బోర్డుకు లేఖ రాయడంతో.. ఈ వ్యవహారంపై బోర్డు దర్యాప్తు జరిపించినట్టు తెలుస్తోంది. విచారణలో అది వాస్తవమే అని తేలడంతో మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి బిల్‌గేట్స్ అయిష్టంగా తప్పుకున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. మహిళా ఉద్యోగినితో బిల్‌గేట్స్‌కు ఉన్న వివాహేతర సంబంధాన్ని బిల్‌గేట్స్ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించినట్టు తెలిపింది. వారిద్దరి మధ్య 20ఏళ్ల క్రితం ఈ సంబంధం ఉండేదని, 2020లో బిల్‌గేట్స్ మైక్రోసాఫ్ట్ ఉద్యోగినితో రిలేషన్‌లో ఉన్నారని.. అయితే దీనికి.. ఆయన బోర్డు నుంచి తప్పుకోవడానికి సంబంధం లేదని ఆ ప్రతినిధి తెలిపారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. 


ఇదిలా ఉంటే.. తమ 27ఏళ్ల వివాహ బంధానికి విడాకుల ద్వారా స్వస్తి పలకాలని నిర్ణయించకున్నట్లు బిల్‌గేట్స్ దంపతులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం వెలువరించిన నేపథ్యంలో బిల్‌గేట్స్ దంపతులు తమ వివాహ బంధానికి ముగింపు పలకడానికి బిల్‌గేట్స్ వివాహేతర సంబంధమే కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో బిల్‌గేట్స్ అక్రమ సంబంధానికి సంబంధించిన అంశం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. 


తాజా వార్తలుమరిన్ని...

Advertisement