కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్న బిల్‌గేట్స్!

ABN , First Publish Date - 2021-01-25T21:50:18+05:30 IST

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడు బిల్ గేట్స్.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయనే స్వయంగా వెల్ల

కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్న బిల్‌గేట్స్!

వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడు బిల్ గేట్స్.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘అమెరికాలో 65ఏళ్ల వయసుగల వారిలో నేను కూడా ఉన్నాను. కొవిడ్-19 వ్యాక్సిన్‌ తీసుకోవడానికి నాకు అర్హత లభించింది. వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాను. దీన్ని గొప్పగా ఫీల్ అవుతున్నాను’ అంటూ బిల్ గేట్స్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఆయన.. శాస్త్రవేత్తలకు, ట్రయల్స్‌లో పాల్గొన్న వలంటీర్లకు, హెల్త్ వర్కర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మమమ్మారి కరాళ నృత్యం చేస్తున్న తరుణంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో గత ఏడాది డిసెంబర్‌లో అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రముఖ అంటు వ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ తదితరులు ఇప్పటికే కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. 


Updated Date - 2021-01-25T21:50:18+05:30 IST