మెలిండాతో కలిసి ఉంటూనే.. ఇద్దరు ఉద్యోగినులతో డేటింగ్ చేయాలనుకున్న బిల్‌గేట్స్.. సంచలన కథనం!
ABN , First Publish Date - 2021-05-18T05:46:16+05:30 IST
ఇటీవల భార్యతో విడాకులు తీసుకున్న ప్రపంచ కుబేరుల్లో ఒకడు బిల్‌గేట్స్ గురించి సంచలన కథనం వెలువడింది. మెలిండాతో వివాహంలో ఉండగానే..
వాషింగ్టన్: ఇటీవల భార్యతో విడాకులు తీసుకున్న ప్రపంచ కుబేరుల్లో ఒకడు బిల్‌గేట్స్ గురించి సంచలన కథనం వెలువడింది. మెలిండాతో వివాహంలో ఉండగానే.. తన సంస్థలో ఉన్న ఇద్దరు ఉద్యోగినులను డేటింగ్ కోసం రమ్మన్నారట బిల్‌గేట్స్. ఈ మేరకు అమెరికాకు చెందని ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. 2006లో ఓ ఉద్యోగినిని తనతో డిన్నర్‌కు రావలసిందిగా బిల్‌గేట్స్ అడిగారట. ఆ సమయంలో ఆమెకు ఈమెయిల్ చేసిన బిల్‌గేట్స్.. ‘‘నీకు ఇది ఇబ్బందిగా అనిపిస్తే, అసలు ఈ ప్రస్తావన వచ్చిందనే విషయమే మర్చిపో’’ అని చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అలాగే గేట్స్ ఫౌండేషన్‌కు పనిచేసే మరో ఉద్యోగినిని కూడా ఇలానే డేట్‌కు పిలిచారట గేట్స్. తాజాగా మరో పత్రిక కూడా బిల్‌గేట్స్ గురించి ఇలాంటి సంచలన కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.