జెఫ్ బెజోస్‌కు రిచర్డ్ బ్రాన్సన్ శుభాకాంక్షలు!

ABN , First Publish Date - 2021-07-21T03:06:09+05:30 IST

తన తొలి రొదశి యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు వర్జిన్ గాలెక్టిక్ సంస్థ అధినేత రిచర్డ్ బ్రాన్సన్‌ శుభాకాంక్షలు చెప్పారు.

జెఫ్ బెజోస్‌కు రిచర్డ్ బ్రాన్సన్ శుభాకాంక్షలు!

వాషింగ్టన్: తన తొలి రొదశి యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు వర్జిన్ గాలెక్టిక్ సంస్థ అధినేత రిచర్డ్ బ్రాన్సన్‌ శుభాకాంక్షలు చెప్పారు. ‘‘అద్భుతం..చాలా బాగా చేశారు. భవిష్యత్తులో మీరు మరింత ప్రగతి సాధించాలని కోరుకుంటున్నా’’  అని ఆయన ట్వీట్ చేశారు. అమెజాన్ వ్యవస్థాపకుడు బెజోస్ సారథ్యంలోని బ్లూ ఆరిజిన్ సంస్థ నేడు చేపట్టిన తొలి అంతరిక్ష యాత్ర విజయవంతమైన విషయం తెలిసిందే. సంస్థకు చెందిన న్యూ షెపర్డ్ వ్యోమనౌక ద్వారా బెజోస్, మరో ముగ్గురితో కలిసి సముద్ర ఉపరితలానికి 106 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నారు. అక్కడ కొద్ది నిమిషాల పాటు భారరహిత స్థితిని ఆస్వాదించి తిరిగి సురక్షితంగా భూమికి చేరుకున్నారు. రిచర్డ్ బ్రాన్స్ నేతృత్వంలోని వర్జిన్ గాలెక్టిక్ సంస్థ అంతరిక్ష యాత్ర చేపట్టిన కొద్ది రోజులకే మరో ప్రైవేటు సంస్థ విజయవంతంగా ఈ యాత్రను నిర్వహించడం ఓ చారిత్రాత్మక ఘట్టం అని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Updated Date - 2021-07-21T03:06:09+05:30 IST