కరోనా మూడో వేవ్ రాదు.. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా

ABN , First Publish Date - 2021-06-22T04:11:50+05:30 IST

భారత్‌లో కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశమే లేదని ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా తాజాగా పేర్కొన్నారు.

కరోనా మూడో వేవ్ రాదు.. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా

ముంబై: భారత్‌లో కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశమే లేదని ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా తాజాగా పేర్కొన్నారు. ఈ వేవ్ కారణంగా మార్కెట్  నెమ్మదిస్తుందన్న భయం అనవసరమని ఆయన భరోసా ఇచ్చారు. ‘‘రెండో వేవ్ వస్తుందని ఎవరూ చెప్పలేకపోయారు. ఇప్పుడు మాత్రం మూడో వేవ్ వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టీకా కార్యక్రమం వేగాన్ని బట్టి, దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ వేళ్లూనుకుంటున్న దాన్ని బట్టీ చూస్తే కరోనా మూడో వేవ్ వస్తుందని చెప్పలేము’’ అని ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకూ భారత్‌లో 28 కోట్ల కరోనా టీకా డోసులు వినియోగమైన విషయం తెలిసిందే. ఇక సార్వత్రిక టీకా కార్యక్రమం ప్రారంభమైన తొలి రేజే ఏకంగా 70 లక్షల టీకా డోసులు ప్రజలకు అందాయి. 

Updated Date - 2021-06-22T04:11:50+05:30 IST