Abn logo
Apr 9 2021 @ 00:32AM

బిల్ట్‌ కార్మికుల ఆందోళన

సమస్యలు పరిష్కరించాలని టవర్‌ ఎక్కి నిరసన

మంగపేట, ఏప్రిల్‌ 8: ములుగు జిల్లా మంగపేట మం డలంలోని కమలాపురం బిల్ట్‌ కర్మాగారంలో పనిచేస్తున్న రె గ్యూలర్‌ కార్మికులు గురువా రం ఆందోళన చేట్టారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించి, తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చిప్పర్‌సైలో టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు. యాజమాన్యం న్యా యం చేయకపోతే దూకి ఆత్మహత్య చేసుకుంటామని  గేదెల నారాయణరావు, తలారి శ్రీనివాసరావు, తలారి శ్రీనివాసరావు, ముత్తయ్యగౌడ్‌, అన్నపురెడ్డి అప్పిరెడ్డి , చంద్రమౌళి హెచ్చరించారు. తోటి కార్మికులు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఎస్సై శ్రీనివాస్‌, వీఆర్వో నారాయణ అక్కడికి చేరుకొని నిరసన తెలుపుతున్న కార్మికులను నచ్చజెప్పేందుకు యత్నించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పడంతో కార్మికులు శాంతించారు.


Advertisement
Advertisement