'బింబిసార' టీజర్ వచ్చేది ఎప్పుడంటే..!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'బింబిసార'. త్వరలో ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించిది. టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈమూవీకి నూతన దర్శకుడు మల్లిడి వశిస్ట్ దర్శకత్వం వహిస్తున్నాడు. సంయుక్త మీనన్ ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా, ఈ నెల 29న 'బింబిసార' చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. 


Advertisement