ఎస్‌ఎ్‌ఫఏపై విచారణ

ABN , First Publish Date - 2021-04-13T07:02:51+05:30 IST

బయోమెట్రిక్‌ యంత్రంలో నకిలీ వేలిముద్రలు వినియోగించి విధులకు హాజరు కాని పారిశుధ్య కార్మికులకు హాజరు వేస్తూ

ఎస్‌ఎ్‌ఫఏపై విచారణ

 నకిలీ వేలిముద్రల వ్యవహారంలో బయటపడ్డ వాస్తవాలు

 ఆరోపణలు రుజువైనా విధుల్లో కొనసాగింపు

 విమర్శలకు తావిస్తున్న అధికారుల తీరు


కుత్బుల్లాపూర్‌, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): బయోమెట్రిక్‌ యంత్రంలో నకిలీ వేలిముద్రలు వినియోగించి విధులకు హాజరు కాని పారిశుధ్య కార్మికులకు హాజరు వేస్తూ డబ్బులు దండుకుంటున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ ఎస్‌ఎ్‌ఫఏ సంపత్‌పై విచారణ కొనసాగుతోంది. హాజరు నమోదులో జరిగిన అక్రమాలపై ఇటీవల ఆంధ్రజ్యోతిలో ‘మళ్లీ తెరపైకి నకిలీ వేలిముద్రల బాగోతం’, ‘ఎస్‌ఎ్‌ఫఏపై చర్యలేవి?’ అనే శీర్షికన ప్రచురితమైన వరుస కథనాలకు కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ అధికారులు కదిలారు. డీసీ మంగతాయారు ఆదేశాల మేరకు సదరు ఆరోపణలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని సర్కిల్‌ ఇన్‌చార్జి ఏఎంవోహెచ్‌ భానుచందర్‌ను ఆదేశిం చారు. దీంతో ఆయన సోమవారం క్షేత్రస్థాయిలో విచారించారు. ఓ మహిళ కార్మికురాలు, మరో కార్మికుడి హాజరు విషయంలో నకిలీ వేలిముద్రలు వినియోగించినట్లు ఇప్పటి వరకు చేసిన విచారణలో తెలిందని భానుచందర్‌ ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఇదే విషయాన్ని డీసీకి కూడా వివరించామని ఆయన తెలిపారు.

 

ఆరోపణలు రుజువైనా..

ఎస్‌ఎ్‌ఫఏ సంపత్‌ కార్మికుల హాజరు నమోదులో నకిలీ వేలిముద్రలు వినియోగిస్తున్నాడని ఏఎంవోహెచ్‌ చేపట్టిన విచారణలో రుజువైనా సదరు ఎస్‌ఎ్‌ఫఏ నుంచి బయోమెట్రిక్‌ యంత్రాన్ని తీసుకోకుండా, అధికారులు విధుల్లోనే అతన్ని కొనసాగిస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది. గతంలో ఇదే విషయంలో  ఆరోపణలు ఎదురుకున్న పలు సర్కిళ్ల ఎస్‌ఎ్‌ఫఏల నుంచి బయోమెట్రిక్‌ యంత్రాలను స్వాధీనం చేసుకుని విచారణ పూరౖయ్యే వరకు విధుల నుంచి పక్కన పెట్టారు. దానికి భిన్నంగా ప్రస్తుతం అధికారులు వ్యవహరించడం గమనార్హం.




Updated Date - 2021-04-13T07:02:51+05:30 IST