బీర్బల్‌ తెలివి

ABN , First Publish Date - 2020-09-06T05:30:00+05:30 IST

ఒకరోజు అక్బర్‌ చక్రవర్తి సభలో అడిగిన ప్రశ్న అందరినీ ఆశ్చర్యపరిచింది. సమాధానం ఏం చెప్పాలో తెలియక అంతా తలలు పట్టుకున్నారు.

బీర్బల్‌ తెలివి

ఒకరోజు అక్బర్‌ చక్రవర్తి సభలో అడిగిన ప్రశ్న అందరినీ ఆశ్చర్యపరిచింది. సమాధానం ఏం చెప్పాలో తెలియక అంతా తలలు పట్టుకున్నారు. అందరూ ప్రయత్నించారు కానీ చెప్పలేకపోయారు. అప్పుడే సభకు వచ్చిన బీర్బల్‌ ‘ఏంటి విషయం’ అని అడిగితే ‘ఈ పట్టణంలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయి’ అని అక్బర్‌ అడిగారు అని ఒకాయన చెప్పాడు. వెంటనే బీర్బల్‌ నవ్వి, అక్బర్‌ దగ్గరకు వెళ్లాడు. ‘ఈ పట్టణంలో ఇరవై వేల అయిదు వందల ఇరవై మూడు కాకులు ఉన్నాయి’ అని సమాధానం చెప్పాడు. ‘అంత కచ్చితంగా నీకు ఎలా తెలుసు’ అని అక్బర్‌ అడిగాడు. అప్పుడు బీర్బల్‌ ‘సైనికులను చెప్పి కాకులను లెక్కించండి. ఒకవేళ నేను చెప్పిన సంఖ్య కన్నా ఎక్కువ ఉంటే అవి వాటి చుట్టాలు అయి ఉంటాయి. పక్క పట్టణం నుంచి వచ్చి ఉంటాయి. ఒకవేళ తక్కువ ఉంటే అవి  తమ చుట్టాలను చూడడానికి పక్క పట్టణం వెళ్లి ఉంటాయి’ అని తెలివిగా జవాబు చెప్పాడు. బీర్బల్‌ తెలివికి మెచ్చిన అక్బర్‌ ముత్యాల దండతో సన్మానించాడు.

Updated Date - 2020-09-06T05:30:00+05:30 IST