పంజాబ్‌లో బర్డ్‌ఫ్లూ కలకలం
ABN , First Publish Date - 2021-05-09T01:12:32+05:30 IST
కొవిడ్-19 కల్లోలం మధ్య పంజాబ్‌లో తాజాగా బర్డ్‌ఫ్లూ కలకలం రేపింది. లూదియానాలో ఓ పౌల్ట్రీ ఫామ్‌లో సేకరించిన శాంపిల్స్‌లో..
లూదియానా: కొవిడ్-19 కల్లోలం మధ్య పంజాబ్‌లో తాజాగా బర్డ్‌ఫ్లూ కలకలం రేపింది. లూదియానాలో ఓ పౌల్ట్రీ ఫామ్‌లో సేకరించిన శాంపిల్స్‌లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని తేలడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను ఖననం చేయడంతో పాటు.. వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. లూదియానాకి 25 కిలోమీటర్ల దూరంలోని ఖిలా రాయ్‌పూర్‌లో ఓ ఫౌల్ట్రీ ఫామ్ నుంచి ఇటీవల శాంపిల్స్ సేకరించి.. భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యురిటీ యానిమల్ డిసీజెస్‌కు పంపించారు. ఇవాళ వెల్లడైన ఫలితాల్లో బర్డ్‌ఫ్లూ పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ ఫౌల్ట్రీ ఫామ్‌ను పంజాబ్ ప్రభుత్వం ఇన్ఫెక్టెడ్ ఏరియాగా ప్రకటించినట్టు డిప్యూటీ కమిషనర్ వరీందర్ శర్మ పేర్కొన్నారు. ఇక్కడ కంటైన్మెంట్ పరిస్థిని సమీక్షించేందుకు అదనపు డిప్యూటీ కమిషనర్ సర్కార్తార్ సింగ్‌ను ఇంచార్జ్‌గా నియమించారు. ఇక్కడి నుంచి బతికున్న కోళ్లుగానీ, చనిపోయినవి గానీ ఒక్కటి కూడా బయటికి పోనీయకుండా.. లోపలికి రానీయకుండా కమిటీ పర్యవేక్షిస్తుందని శర్మ పేర్కొన్నారు.