Abn logo
Jan 14 2021 @ 02:25AM

డిచ్‌పల్లిలో బర్డ్‌ఫ్లూ కలకలం

యానంపల్లిలో 2 వేలకు పైగా కోళ్లు మృత్యువాత


డిచ్‌పల్లి, జనవరి 13: నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. స్థానిక యానంపల్లి గిరిజన తండాలోని ఓ పౌలీ్ట్రఫామ్‌లో వేలాది కోళ్లు మృతి చెందడంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. మంగళ, బుధవారాల్లో ఏకంగా 2 వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. సమాచారం అందుకున్న నిజామాబాద్‌ జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ భరత్‌, ఏడీ దేశ్‌పాండే పశువైద్యాధికారి డాక్టర్‌ గోపీకృష్ణ పౌలీ్ట్రఫామ్‌కు చేరుకొని కోళ్ల కలేబరాలను పరిశీలించారు. ఫామ్‌ నిర్వాహకుడు రాంచందర్‌గౌడ్‌తో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బతికున్న కోళ్ల రక్తనమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు తరలించారు. అనంతరం జేడీ భరత్‌ మాట్లాడుతూ.. కోళ్లు చనిపోయిన విధానాన్ని పరిశీలిస్తే బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించడం లేదని తెలిపారు. ల్యాబ్‌ రిపోర్టు వచ్చేవరకు తాము కచ్చితమైన కారణాలు చెప్పలేమన్నారు. ఈ ఘటనతో.. పౌలీ్ట్ర ఫామ్‌ నిర్వాహకులతో పాటు గ్రామస్థులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement
Advertisement