మనుషులు, తాబేళ్ల కన్నీళ్లు దాదాపు ఒకటేనట!

ABN , First Publish Date - 2020-08-14T05:09:07+05:30 IST

పక్షులు, సరీసృపాలకు ఎడు జాతుల జంతువుల కన్నీళ్లపై పరిశోధన జరిపిన బ్రెజిల్ శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికర విషయాన్ని కనిపెట్టారు. కన్నీళ్ల విషయంలో మనుషులకు, వీటికీ మధ్య పెద్ద తేడా లేదని వారు తెసుకున్నారు.

మనుషులు, తాబేళ్ల కన్నీళ్లు దాదాపు ఒకటేనట!

న్యూఢిల్లీ: పక్షులు, సరీసృపాలకు చెందిన 7 రకాల జీవాల కన్నీళ్లపై పరిశోధన జరిపిన బ్రెజిల్ శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికర విషయాన్ని కనిపెట్టారు. కన్నీళ్ల విషయంలో మనుషులకు, వీటికీ మధ్య పెద్ద తేడా లేదని వారు తెలుసుకున్నారు. అయితే ఉన్న కొద్ది పాటి తేడాలను అధ్యయనం చేయడం ద్వారా మనుషుల, జంతువుల కంటి చికిత్సలో కొత్త పద్ధతులను కనుగొనవచ్చని వారు తెలిపారు. కంటి చూపును పరిరక్షించడంలో కన్నీళ్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్న విషయం తెలిసిందే. అయితే మనుషుల కన్నీళ్లు మినహా ఇతర జంతువుల విషయంలో శాస్త్రవేత్తలకు ఉన్న అవగాహన పరిమితమే. ఇప్పటివరకూ కుక్కలు, కోతులు, ఒంటెల కన్నీరుపై మాత్రమే అధ్యయనం జరిగింది. అయితే జీవ పరిణామ క్రమంలో కన్నీళ్లు ఎలా ఉనికిలోకి వచ్చాయో తెలుసుకునేందుకు బ్రెజిల్ శాస్త్రవేత్తలు తాజాగా పక్షులు, సరీసృపాలను అధ్యయనం చేశారు. గెద్దలు, తాబేళ్లు, చిలుకలు వంటి ఏడు రకాల జీవాల కన్నీళ్లును పరిశీలించారు. ఈ క్రమంలో.. వాటికి, మనుషులకు కన్నీళ్ల విషయంలో చాలా సారూప్యత ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 

Updated Date - 2020-08-14T05:09:07+05:30 IST