బిర్సాముండాను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-06-14T04:55:54+05:30 IST

ఆదివాసీల హక్కుల కోసం పోరాటాలు చేసిన ఆదివాసీల ఆరాధ్య దైవం, తొలితరం ఉద్యమనాయకుడు భగవాన్‌ బిర్సాముం డాను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం బిర్సాముండా వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

బిర్సాముండాను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి
బిర్సాముండా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌అర్బన్‌, జూన్‌ 13: ఆదివాసీల హక్కుల కోసం పోరాటాలు చేసిన ఆదివాసీల ఆరాధ్య దైవం, తొలితరం ఉద్యమనాయకుడు భగవాన్‌ బిర్సాముం డాను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం బిర్సాముండా వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎంపీ నగేష్‌, ఆదివాసీలతో కలిసి బిర్సాముండా విగ్రహాం వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప మహనీయుడని కొనియాడారు. అనంతరం జిల్లాకు చెందిన ఆదివాసీ కోవ రమేష్‌కు పోలీసు రైటర్‌ సేవ పథకంలో భాగంగా స్టేట్‌ అవార్డు రావడంతో ఆయనను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. ఇందులో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, టీఆర్‌ఎస్‌, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

మహరాణా ప్రతాప్‌సింగ్‌ సేవలు ఆదర్శం..

భారతదేశం ఎంతో మంది పుణ్య పురుషులకు, వీర యోధులకు జన్మనిచ్చిన గడ్డ అని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. అలాంటి వీర పురుషుల్లో ఒకరు మమరాణా ప్రతాప్‌సింగ్‌ అని కొనియాడారు. జిల్లాకేంద్రంలో ఆదివారం నిర్వహించిన మహరాణా ప్రతాప్‌సింగ్‌ 481వ జయంతివేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌పుత్‌ సమాజ్‌ సభ్యులతో కలిసి రానా ప్రతాప్‌సింగ్‌ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఇందులో రాజ్‌పుత్‌ సమాజ అధ్యక్షుడు స్వదీప్‌సింగ్‌, సభ్యులు రాజేందర్‌సింగ్‌, జగదీశ్‌సింగ్‌, షెకావత్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యశ్రీ సేవా కేంద్రం ప్రారంభం..

జిల్లాలో ఇప్పుడిప్పుడే కార్పొరేట్‌ స్థాయిలో మెరుగైన వైద్యం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పడిన క్రోమ్‌ ఆర్థోపెడిక్‌ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య శ్రీ విభాగాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్‌రాథోడ్‌, ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్‌ సాయి కృష్ణలతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.  . 

రామన్నను కలిసిన మహారాష్ట్ర కిన్వట్‌ ఎమ్మెల్యే..

మహారాష్ట్ర కిన్వట్‌ ఎమ్మెల్యే భీమ్‌రావ్‌ రాంజీకేరాం ఆదివారం ఎమ్మెల్యే జోగు రామన్నను కైలాస్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి తన కుమారుడి పెళ్లి శుభలేఖను అందించారు. అలాగే మహారాష్ట్ర-తెలంగాణ బోర్డర్‌ అయిన కిన్వట్‌ రోడ్‌ కనెక్షన్‌, కోసాయి ఉమ్రి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే జోగు రామన్నకు విన్నవించారు.

Updated Date - 2021-06-14T04:55:54+05:30 IST