శృతిమించుతున్న బర్త్ డే వేడుకలు

ABN , First Publish Date - 2021-08-12T21:57:12+05:30 IST

నిజామాబాద్‌లో బర్త్ డే వేడుకల్లో నిర్వహకులు శృతిమించి ప్రవర్తించారు. వేడుకల్లో తల్వార్లు, పిస్తోల్‌‌తో

శృతిమించుతున్న బర్త్ డే వేడుకలు

నిజామాబాద్: నిజామాబాద్‌లో బర్త్ డే వేడుకల్లో నిర్వహకులు శృతిమించి ప్రవర్తించారు. వేడుకల్లో తల్వార్లు, పిస్తోల్‌‌తో హల్‌చల్‌ చేశారు. ఫాం హౌస్‌లో అరిఫ్ అనే రౌడీ షీటర్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో అరిఫ్‌ గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇటీవల దొంగతనాలు, దారి దోపిడీ కేసులో అరిఫ్‌‌పై పోలీసులు పీడీ యాక్టు పెట్టారు. ఈ కేసులో జైల్ నుంచి బెయిల్‌పై అరిఫ్ బయటకు వచ్చాడు. అంతేకాకుండా 11 వ డివిజన్ టీఆర్‌ఎస్‌ లీడర్ ఖయూం బర్త్ డే వేడుకల్లో తల్వార్‌తో కేక్ కట్ చేశారు. పుట్టిన రోజు వేడుకల్లో  నగర మేయర్ దంపతులు పాల్గొన్నారు. పోలీసుల నిఘా లేకపోవడంతో వేడుకల్లో శృతిమించిపోతున్నారని పలువురు చెబుతున్నారు.


Updated Date - 2021-08-12T21:57:12+05:30 IST