విశాఖ: పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-09-19T16:47:37+05:30 IST

పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. అచ్యుతాపురం కొండకర్ల వద్ద స్విమ్మింగ్ పూల్‌లో పడి యువకుడు మృతిచెందాడు. గాజువాకకు చెందిన సుధాకర్

విశాఖ: పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. ఒకరి మృతి

విశాఖ: పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. అచ్యుతాపురం కొండకర్ల వద్ద స్విమ్మింగ్ పూల్‌లో పడి యువకుడు మృతిచెందాడు. గాజువాకకు చెందిన సుధాకర్ అనే యువకుడి బర్త్‌డే పార్టీలో యువకులు పాల్గొన్నారు. అనంతరం స్విమ్మింగ్ చేస్తుండగా సాయి అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-09-19T16:47:37+05:30 IST