క్రీస్తు పుట్టినరోజు

ABN , First Publish Date - 2020-12-25T11:53:49+05:30 IST

ఈ రోజు క్రీస్తు జన్మదినం. ఆయన పుట్టిన రోజును క్రిస్మస్‌ పండుగగా జరుపుకొంటాం.

క్రీస్తు పుట్టినరోజు

 ఈ రోజు క్రీస్తు జన్మదినం. ఆయన పుట్టిన రోజును క్రిస్మస్‌ పండుగగా జరుపుకొంటాం. 


 క్రిస్మస్‌ పండగను ఎక్స్‌మస్‌ అని కూడా అంటారు. ఎక్స్‌ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. ఎక్స్‌ అంటే క్రీస్ట్‌ అని అర్థం. అందుకే ఎక్స్‌మస్‌ అన్నా, క్రిస్మస్‌ అన్నా ఒక్కటే.


 క్రిస్మస్‌ అనగానే శాంతాక్లాజ్‌ గుర్తొస్తాడు. అయితే శాంతాక్లాజ్‌ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? 1773లో న్యూయార్క్‌ న్యూస్‌పేపర్‌ ఒక కథనం ప్రచురించింది. అందులో డచ్‌ భాషలో పిలిచే సింటర్‌క్లాస్‌ను శాంతాక్లాజ్‌గా రాసింది. అప్పటి నుంచి శాంతాక్లాజ్‌ పేరు స్థిరపడింది.


 శాంతాక్లాజ్‌ అనే క్యారెక్టర్‌ను పరిచయం చేసింది సెయింట్‌ నికోలస్‌ అనే వ్యక్తి. ఆయన బిషప్‌గా పనిచేసేవాడు. ఆయనకు పిల్లలంటే ప్రాణం. వారికి రహస్యంగా బహుమతులు ఇవ్వడం ద్వారా ఆనందించేవాడు.

 

 క్రిస్మస్‌ రోజున బహుమతులు ఇచ్చిపుచ్చుకొంటారు. స్నేహితులకు, బంధువులకు కానుకలు ఇచ్చి సంతోషాన్ని పంచుకుంటారు. ఇంటి ముందు క్రిస్మస్‌ ట్రీల చూడచక్కగా అలంకరిస్తారు.

Updated Date - 2020-12-25T11:53:49+05:30 IST