300 మందితో కరోనా ‘విందు’

ABN , First Publish Date - 2021-06-21T05:24:43+05:30 IST

ఆయనో ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు... ప్రస్తుత కరోనా విపత్తులో ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆయనే కొవిడ్‌ నిబంధనలను విస్మరించి విందు ఏర్పాటు చేశారు. దానికి ఐదు.. పది మంది కాదు దాదాపుగా 300 మంది హాజరయ్యారు. వారిలో ఎక్కువ మందికి మాస్కులు లేవు. భౌతిక దూరం అనే మాటను పూర్తిగా మరిచిపోయారు.

300 మందితో కరోనా ‘విందు’

ధనలక్ష్మీపురంలో ఓ వైద్యుడి నిర్వాకం


నెల్లూరు రూరల్‌, జూన్‌ 20 :  ఆయనో ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు... ప్రస్తుత కరోనా విపత్తులో ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆయనే కొవిడ్‌ నిబంధనలను విస్మరించి విందు ఏర్పాటు చేశారు. దానికి ఐదు.. పది మంది కాదు దాదాపుగా 300 మంది హాజరయ్యారు. వారిలో ఎక్కువ మందికి మాస్కులు లేవు. భౌతిక దూరం అనే మాటను పూర్తిగా మరిచిపోయారు. ఇదంతా ఆదివారం నెల్లూరు శివార్లలోని ధనలక్ష్మీపురంలో జరిగింది. సదరు వైద్యుడికి ఆ ప్రాంతంలో ఓ స్థలం ఉంది. అందులో స్నేహితులు, సన్నిహితులకు సండే స్పెషల్‌గా బిర్యా నీ వండి వడ్డించారు. ఈ విందుకు హాజరైన వారిలో ప్రముఖులు కూడా ఉన్నట్లు సమా చారం. మరి కరోనా లేదనుకున్నారో... ఉన్నా ఏం చేస్తుందిలే! అనుకున్నారోగానీ సామాజిక బాధ్యతను మరిచి విందు ఆరగించారు. చూసిన వారంతా డాక్టరే ఇలా చేస్తే ఎలా? అంటూ ముక్కున వేలేసుకున్నారు. కాగా, ఈ విందు జరిగే ప్రాంగణంలోకి పొరపాటున కూడా కొత్త వ్యక్తులు ప్రవేశించకుండా కాపలా ఏర్పాటు చేయడం కొసమెరుపు.

Updated Date - 2021-06-21T05:24:43+05:30 IST